Thursday, October 19, 2017

RBI లో డిగ్రీతో అసిస్టెంట్ ఉద్యోగాలు



రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ కార్యాలయాలతోపాటు ముంబై ప్రధాన కేంద్రంలోని అసిస్టెంట్ పోస్టులను భర్తీచేస్తారు. ఎంపికైన వారికి ప్రారంభవేతనం నెలకు రూ.35 వేలు నుంచి రూ.45 వేల వరకు చెల్లిస్తారు.

అసిస్టెంట్: 623

రీజినల్ వారిగా పోస్టులు: అహ్మదాబాద్ 19, బెంగళూరు 25, భోపాల్ 25, భువనేశ్వర్ 17, చండీగఢ్ 13, చెన్నై 15, గువహటి 36, హైదరాబాద్ 16, జయపుర 13, జమ్ము 23, కాన్పూర్ అండ్ లఖ్‌నవూ 44, కోల్‌కతా 23, ముంబై 264, నాగ్‌పూర్ 15, న్యూఢిల్లీ 47, పట్నా 15, తిరువనంతపురం 13.

విద్యార్హతలు: 2017 అక్టోబరు 1 వరకు ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. SC,ST దివ్యాంగులు ఉత్తీర్ణులైతే సరిపోతుంది.

ఏజ్ లిమిట్: 2017 అక్టోబరు 1 వరకు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం SC,ST,OBC, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్‌కు మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: RBI వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. ఫీజు రూ.450 ఆన్‌లైన్‌లో చెల్లించాలి. SC,ST, దివ్యాంగులు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపిక విధానం: ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ప్రాథమిక పరీక్షను 100 మార్కులకు ఆబ్జెక్టివ్ తరహాలో నిర్వహిస్తారు. ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 మార్కులు, న్యుమరికల్ ఎబిలిటీ 35 మార్కులు, రీజనింగ్ 35 మార్కులు. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్స్ ఉంటుంది. మెయిన్‌‌లో 200 మార్కులు. రీజనింగ్ 40, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 40, జనరల్ అవేర్‌నెస్ 40, న్యుమరికల్ ఎబిలిటీ 40, కంప్యూటర్ నాలెడ్జ్ 40 మార్కులు. దీనిలో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎల్పీటీకి పిలుస్తారు. దీన్ని స్థానిక భాషలోనే నిర్వహిస్తారు.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: అక్టోబరు 18
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: నవంబరు 10
ప్రిలిమినరీ పరీక్ష: నవంబరు 27, 28
మెయిన్ ఎగ్జామ్: డిసెంబరు 20

No comments:

Post a Comment